సందీప్‌కిషన్ వినోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.డి.జి. ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ డి.గోహిల్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. సోలో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత కూడా సోలోగానే రూపొందిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- గతంలో తమ సంస్థ నుండి ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’, ‘సినిమా చూపిస్తా మావ’ చిత్రాలను రూపొందించామని, తాజాగా సందీప్ కిషన్‌తో ఓ మంచి చిత్రాన్ని చేయడానికి నిశ్చయించామని తెలిపారు. ప్రసన్నకుమార్ చెప్పిన కథ నచ్చడంతో సెట్స్‌పైకి వెళుతున్నామని, సకుటుంబ సమేతంగా కలసి ఈ సినిమాను చూడవచ్చని, కుటుంబ విలువలతో వినోదాత్మకంగా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. జూలై 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మేజర్ షూటింగ్ పార్ట్ అంతా హైదరాబాద్‌లోనే చేస్తామని, త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:నిజార్ షఫీ, ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, సంగీతం:రథన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, ప్రసన్నకుమార్ బెజవాడ, నిర్మాత:రూపేష్ డి.గోహిల్, దర్శకత్వం:వంశీకృష్ణ.