సంఘమిత్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో రూపొందే సంఘమిత్ర సినిమా విషయంలో హీరోయిన్ కష్టాలు ఇంకా తగ్గలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో ఇంతకుముందు శ్రుతిహాసన్ ఓకె అయ్యింది. కానీ ఎందుకో ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఆ టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు.. లేటెస్టుగా నయనతార పేరు పరిశీలనలో పెట్టారట! ఆమె అయితే ఈ ప్రాజెక్టుకు ఇంకా హైప్ వస్తుందని, పైగా మార్కెట్‌లో ఆమెంటే మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆమెనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం నయనతార రెండేళ్లు సమయం కేటాయిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎలాగైనా సరే ఆమెను ఒప్పించేలా దర్శక నిర్మాతలు గట్టి సన్నాహాలు చేస్తున్నారు మరి.