విభిన్న పాత్రలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అ ఆ’ సినిమాతో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు నితిన్. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. అ ఆ తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న నితిన్, ఇండస్ట్రీలోకి ప్రవేశించి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్, మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ తరువాత మాస్‌కు దగ్గరవుతూ చేసిన దిల్ సినిమా మరో విజయాన్ని అతని ఖాతాలో వేసింది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో నితిన్ మాస్ హీరోగా అవతారం ఎత్తాడు. ఆ తరువాత వరుసగా అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నితిన్‌కు బ్రేక్ పడింది. దాదాపు ఏడేళ్లపాటు ఎన్ని సినిమాలు చేసినా ఒక్క హిట్ దక్కలేదు. అయినా తన ప్రయత్నాన్ని మానలేదు. చాలాకాలం ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడ్డ నితిన్ 2012లో తన స్టైల్‌ను మార్చుకుని చేసిన ‘ఇష్క్’ చిత్రం ఆయన పరాజయాలకు అడ్డుకట్టవేసింది. ఆ సినిమా కూడా సంచలన విజయం సాధించడంతో మళ్లీ కొత్త ఉత్సాహంతో కొత్త తరహా సినిమాలకు సన్నాహాలు మొదలుపెట్టాడు. తన సొంత బానర్‌లో సినిమాలు మొదలుపెట్టిన నితిన్‌కు కథల ఎంపిక విషయంలో కేర్ తీసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కూడా మంచి విజయాన్ని అందించడంతో తన ఉత్సాహం రెట్టింపు అయింది. ఆ తరువాత పూరి జగన్నాధ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’, చిన్నదానా నీకోసం చిత్రాల తరువాత క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా ఛాన్స్ దక్కింది. ఆయన తెరకెక్కించిన అ ఆ చిత్రం నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో అటు మాస్ సినిమాల్ని, ఇటు క్లాస్ సినిమాలను డీల్ చేయగలనని రుజువు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘లై’ సినిమాతో మరో భిన్నమైన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో చేరిన నితిన్, లై తరువాత మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు.