ప్లాటినం వేడుకల్లో సీతమ్మ అందాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. హీరో ఆది, నిఖిల్ ఈ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లను అందజేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, రాజ్‌తరుణ్‌కి ఈ సినిమాతో మరో పెద్ద సక్సెస్‌వచ్చి వరుసగా సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆది మాట్లాడుతూ, శ్రీనివాస్ ఎమోషన్స్ మీద మంచి పట్టు వున్న వ్యక్తి. ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ నేటి ట్రెండ్‌కు తగ్గట్లు ఉండే రాముడు అందమైన సీత కోసం ఏం చేశాడనేది సినిమా కథ. గోపిసుందర్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్‌హిట్ అయింది. స్నేహానికి మంచి వేల్యూ వుండేలా సినిమా వుంటుంది. ‘రామాయణంలో రాముడికి ఫ్రెండ్స్ లేరు, అందుకే రావణాసురుడు వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్ళాడు. కానీ- ఈ రాముడికి ఫ్రెండ్స్ వున్నారు’ అనే డైలాగ్ అందరికీ నచ్చుతుంది. చిన్నప్పటి స్విట్ లవ్‌స్టోరీ ఈ సినిమా. కుటుంబంతో సహా చూడదగ్గ చిత్రం అని చెప్పారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ, గోపిసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం సంతోషంగా వుందన్నారు.