హీరోయినే్ల కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్, అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ ప్రధాన తారాగణంగా స్రవంతి మూవీస్, పి.ఆర్.సినిమాస్ పతాకాలపై రవికిశోర్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఆర్‌ఎఫ్‌సిలో తొలి షెడ్యూల్, వైజాగ్‌లో రెండో షెడ్యూల్ పూర్తిచేశామని తెలిపారు. మూడో షెడ్యూల్‌ను ఐదు రోజులపాటు కె.జి.రెడ్డి కాలేజీ, సంజీవయ్యపార్కు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేశామని, ఈ నెలాఖరునుంచి వైజాగ్, అరకులలో మరో షెడ్యూల్ చేస్తామని తెలిపారు. ‘నేను శైలజ’ సినిమా తరువాత రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయని, అందుకు తగ్గట్టుగా కథ, కథనాలు ఉంటాయని, కథానాయికల పాత్రలు రెండూ సినిమాలో కీలకంగా ఉంటాయని దర్శకుడు కిశోర్ తిరుమల అన్నారు. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే మంచి బాణీలను అందించారని, ఇప్పటివరకు చేసిన షూటింగ్ పూర్తి సంతృప్తిగా వచ్చిందని ఆయన అన్నారు.