తెలుగులో సైరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా 3సైరత్2. నూతన తారలతో నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా 100 కోట్ల మైలురాయిని దాటిన తొలి మరాఠీ భాషా చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా అందరూ గమనించారు. పరువు హత్యల నేపథ్యంలో రూపొందిన 3సైరత్2లో ఆకాష్ తోషర్, రింకూ రాజ్‌గురు జంటగా నటించారు. బాలీవుడ్‌లోని అగ్రతారల మన్ననలు పొందిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతోంది. రీమేక్ రైట్స్ కోసం అనేకమంది పోటీపడగా రాక్‌లైన్ వెంకటేష్ హక్కులను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- తనకెంతో నచ్చిన ఈ చిత్రాన్ని చూసిన వెంటనే రీమేక్ చేయాలనుకున్నానని, 66వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో సినిమా చూసిన అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారని తెలిపారు. లాస్‌ఏంజిల్స్‌లోని సోనీ సింఫని స్టూడియోలో పాటల రికార్డింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమాగా 3సైరత్2 గుర్తింపు పొందిందని, నాగరాజ్ మంజులే దర్శకత్వంలో హృద్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన రింకూ రాజ్‌గురుకి జాతీయ పురస్కారం కూడా లభించిందిన ఆయన తెలిపారు. చిన్న సినిమాలలో పెద్ద విప్లవం తీసుకొచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నామని, తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిందని, త్వరలో లొకేషన్లు ఎంపిక చేస్తామని, పూర్తి వివరాలు ప్రకటిస్తామని ఆయన అన్నారు.