తట్టుకోలేని అభిమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 3రంగస్థలం 19852 సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ కూడా ఆయా ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం సినిమా కష్టాలు మొదలయ్యాయి. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉందని, షూటింగ్ చేయడానికి కూడా ఇబ్బంది కలుగుతోందట. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన సన్నివేశాలను అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాంతో సినిమాకు సంబంధించిన స్టిల్స్ లీక్ అవ్వడంతో దర్శకుడు టెన్షన్ ప పడుతున్నాడట. ఇప్పటికే రామ్‌చరణ్ ఉన్న పలు స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దానికితోడు సినిమాకు సంబంధించిన రహస్యమేదీ ఉండటంలేదని, ఇలా అయితే షూటింగ్ ఆపేయడమే బెటర్ అనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడట. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో అభిమానులను ఎలా కట్టడి చేస్తారో చూడాలి.