అలాంటివేం లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై గ్లామర్ భామ పరిణీతి చోప్రా చేసిన సినిమాలు తక్కువే అయినా, ఆమెపై వస్తున్న పుకార్లు, వార్తలతోనే క్రేజ్ పెంచుకుంది. ‘మేరీ ప్యారీ బిందు’ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ గ్లామర్ భఆమ ఈమధ్య బాగా స్లిమ్ అయింది. ప్రస్తుతం ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్ టాక్. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. పరిణీతి పరిశ్రమకు వచ్చిన కొత్తగా అర్జున్‌కపూర్‌తో కొన్నాళ్ళు, ఆ తరువాత ఉదయ్ చోప్రాతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత దర్శకుడు మనీశ్ శర్మతో కొన్నాళ్ళు ప్రేమలో మునిగిన ఈమె అతనికి బ్రేక్‌అప్ చెప్పి సహాయ దర్శకుడు చరిత్ దేశాయ్‌తో ఎఫైర్ సాగించింది. ఇక్కడితో ఈ భామపై వస్తున్న పుకార్లు మాత్రం ఆగలేదు. పరిణీతి క్లోజ్‌ఫ్రెండ్ సంజనతో ఈమె లెస్బో.. రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తోందంటూ ఓ ప్రచారం సాగింది. ఇద్దరూ కలిసి దుబాయ్‌లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేసినట్లు బాలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసలు. ఈ విషయంపై స్పందించిన పరిణీతి తనపై వచ్చే రూమర్స్ విని నవ్వాపుకోలేకపోయానని, ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థంకాదని, మొత్తానికి ఇంతమంది బాయ్‌ఫ్రెండ్స్ నాకున్నారా! ఓ మై గాడ్.. అంటూ సంజనతో కూడా సంబంధం అంటగట్టడం నిజంగా షాక్‌కు గురయ్యే విషయమని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఏ విషయాన్నీ క్లియర్‌గా మాత్రం చెప్పలేదు. అదీ.. పరిణితి చోప్రా అంటే!