విభిన్నమైన పాత్రలే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ఆది పినిశెట్టి ‘సరైనోడు’ చిత్రంలో నెగిటివ్ షేడ్‌లో నటించి అదరగొట్టాడు ఆది. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు భిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నటించిన తాజా చిత్రం ‘మరకతమణి’. నిక్కీగర్లాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు.
అందరికీ నచ్చింది
‘మరకతమణి’ చిత్రం మంచి విజయం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇందులోని థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఎంజాయి చేస్తున్నారు.
భిన్నమైన పాత్రలు
‘సరైనోడు’ చిత్రంలో విలన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నా. అందులో వైరం ధనుష్ పాత్రకు ఓ ఐడియాలజీ ఉంది కాబట్టి చేసాను. రెగ్యులర్ విలన్ పాత్రలు చేయను. అలాంటి భిన్నమైన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.
పవన్ సినిమాలో..
ప్రస్తుతం పవన్ కల్యాణ్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాను. ఇందులో కూడా తన పాత్రకు ఓ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి ఒప్పుకున్నా. దానికోసం నేను హీరోతో ఫైట్ చేస్తా. నాదెలాంటి పాత్రో సినిమా చూసి మీరే తెలుసుకుంటారు. అలాగే హీరోగా మరో చిత్రం తెలుగులో ఉంటుంది. దాంతోపాటు తమిళంలో కూడా ఓ సినిమా చేయాలి.

-శ్రీ