దసరా బరిలో జై లవకుశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ చిత్రం ప్రస్తుతం ఫిలిం సిటీలో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇందులో నెగిటివ్ రోల్ కూడా పోషిస్తున్నారట. జై, లవ, కుశుడు పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ నటన అద్భుతంగా వస్తుందని ఖచ్చితంగా ఆయన ఫాన్స్‌కి ఈ సినిమా పండగ లాంటిదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి కల్యాణరామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రాశిఖన్న, నివేద థామస్ నటిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి దసరా సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు బిజినెస్ పరంగా అప్పుడే సంచలనం సృష్టిస్తోంది.