నయనకు ఫిలింఫేర్ అవార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డు మలయాళ చిత్రానికి సంబంధించి అందుకున్నారు. మలయాళంలో విజయవంతమైన 3పుదియ నియమం2 చిత్రానికిగాను నయనతార ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో 3వాసుకి2గా అందిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే స్ర్తి కథాంశంతో ఈ సినిమా రూపొందింది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్.మోహన్ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సమస్య కనుక సినిమాపై మంచి క్రేజ్ వచ్చింది. దానికితోడు హీరోయిన్‌కు ఫిలింఫేర్ అవార్డు రావడంతో మరికొంత ప్లస్ అయింది. త్వరలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.