కొత్తదనముంటేనే చూస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సినిమా కథల్లో ట్రెండ్ మారింది. కథలో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆసక్తి చూపిస్తున్నారు.. అలాగే ప్రేక్షకులు కూడా రెగ్యులర్ ఫార్మాట్‌లో కథలు వినడానికి ఎవరూ ఆసక్తిగా లేరని అంటున్నాడు దర్శకుడు సంపత్‌నంది. 3రచ్చ2 సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆయన, 3బెంగాల్ టైగర్2తో మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా 3గౌతమ్‌నంద2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది చెప్పిన ముచ్చట్లు...
గోపీచంద్ న్యూ లుక్..
ఓ పెద్ద బిలియనీర్ కొడుకు గోపీచంద్. ఎంత పెద్ద బిలియనీర్ అంటే ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మాగజైన్‌లో స్థానం సంపాదించిన బిలియనీర్ అన్నమాట. ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించిన వ్యక్తులు, వాళ్ల పిల్లల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది అని పరిశోధన చేసి ఈ లుక్స్‌ను ఫైనలైజ్ చేశాను. కథ, కేరెక్టర్ ప్రకారం చేసిందే తప్ప స్టైల్ కోసం కాదు. హీరోను నేను ఎలా ఊహించుకున్నానో గోపీచంద్ అంతకన్నా బాగున్నాడు. ఈ సినిమా కోసం ఆయన స్కై డైవింగ్, వింగ్ వాక్, ఎడారిలో బైక్ రైడింగ్ వంటి వైల్డ్ అడ్వెంచర్స్ చేశారు. దర్శకుడిగా నేను ఏదైనా రాసుకోవచ్చు. కానీ హీరో నుం చి సహకారం లేకుంటే ఏదీ చేయలేం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను ఇప్పటివరకు 25 లక్షల మంది చూశారు. దీన్ని ప్రేక్షకులు నాకు ఇచ్చిన పుట్టినరోజు బహుమతిగా భావిస్తున్నా.
పవన్ కోసం కాదు
ఇందులో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. విలన్‌గా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో తంగబలిగా నటించిన నికిథిన్ ధీర్, ముఖేష్ రుషి నటిస్తున్నారు. టైటిల్ గురిచి అయితే పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథ కాదు ఇది. ఎవరి దగ్గరో మార్కులు కొట్టేయడానికి గౌతమ్‌నందా టైటిల్ పెట్టలేదు. కథ ప్రకారమే అలా పెట్టాం.
పక్కా కమర్షియల్ పంథా
ఈ కథ గురించి చెప్పాలంటే ప్రజలకు లేదా ఊరికి కష్టం వస్తే హీరో ఆదుకున్నాడనే అంశాల చుట్టూ నేను సినిమాలు చేశాను. కానీ మొదటిసారి ఎవరికోసమే కాదు, నీ కోసం నువ్వు ప్రయాణించు అనేలా కథకు కోసం తాను ప్రయాణించే వ్యక్తి కథను తెరపై చూపించబోతున్నా. రమణ మహర్షికి ఓసారి ఇలాంటి ఆలోచన కలిగిందట. అసలు నేనెవరిని? ఆ ప్రశ్నలోంచి వచ్చిన ఆలోచనే ఇది.
నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకో అని కుమారుణ్ణి బయటికి పంపిస్తాడు ఓ తండ్రి. అప్పుడు వేమనని వాళ్ల వదిన తిట్టినప్పుడు, రైల్వే కంపార్ట్‌మెంట్‌నుండి గాంధీజీని తోసివేసినప్పుడు మన విలువ ఏంటి అని వాళ్లు తెలుసుకున్నట్టు. హీరో సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎలా క్రియేట్ చేశాడు అనేదాన్ని చూపిస్తున్నాం. పక్కా కమర్షియల్ పంథాలోనే సాగుతుంది.
డ్యూయెల్ రోల్ కష్టమే
నిజానికి అటు దర్శకుడు నిర్మాత రెండు కష్టమైన పాత్రలే. నిర్మాతగా చేయడానికి కారణం ఏంటంటే, కొత్తగా, అందంగా అనిపించిన ప్రేమకథలను తెరకెక్కించాలనుకున్నప్పుడు. దాన్ని రాసుకొని ఎక్కడో లోపల పెట్టుకోవడం కంటే, బయటకు పంపిస్తే పదిమందికి నచ్చొచ్చు. అందుకే క్యూట్ లవ్‌స్టోరీ అయిడియా వస్తే నిర్మాతగా మారా.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికైతే కథలు సిద్ధం చేస్తున్నా. కానీ ఏ హీరోతో అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఈ సినిమా తరువాత మంచి కథ రాసి అది ఎవరికి నచ్చితే ఆ హీరోతో సినిమా చేస్తా.

- శ్రీ