సినారె లేని లోటు తీర్చలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను దాదాపు 30 సంవత్సరాలనుండి పరిశ్రమలో ఉన్నా. మహాకవి సినారెతో మం చి సాన్నిహిత్యం వుంది. ఎన్నో గొప్ప రచన లు చేసిన ఆయన, మూడు వేలకు పైచిలు కు పాటలు రాసి, తెలుగు ప్రజల గుండెలలో మల్లెపూలు కురిపించారు. ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు ఎదురొచ్చాయి. అలాంటి దిగ్గజ కవి లేని లోటు ఎవరూ భర్తీచేయలేనిది. ఆయన అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పాల్గొన్నారంటే ఆ వ్యక్తి గొప్పతనం తెలుస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని2 ప్రార్థిస్తున్నానని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. రచయిత సి.నారాయణరెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేసి నివాళులు అర్పించారు. 14 ఏళ్ల వయసులో సినారెతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆయన పాటలలో తాను నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, మంచి నటిగా ఎదుగుతానని అప్పట్లోనే ఆయన భుజం తట్టి ప్రోత్సహించారని నటి కవిత తెలిపారు. ఆయన మరణవార్త విని చలించిపోయానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె అన్నారు. తాను రూపొందించిన స్టేట్‌రౌడీ చిత్రానికి పాటలు ఆయన రాశారని, అప్పటినుండి ఆయనతో మంచి అనుబంధం ఉందని, ఎన్నో వేల పాటలు రచించిన ఆయన ప్రతి పాటను ఆణిముత్యంగా తీర్చిదిద్దారని దర్శకుడు బి.గోపాల్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కృష్ణమూర్తి, బుల్లెట్ రవి, మామిడి హరికృష్ణ, గీతాంజలి, సాయి వెంకట్, పరుచూరి బ్రదర్స్, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.