తెలుగు సినిమాలంటే గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకమంది హీరోయిన్లు టాలీవుడ్ లో తమ ప్రతిభ నిరూపించుకొని బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్‌లో నటిగా నిరూపించుకొని తెలుగు చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతోంది. టాలీవుడ్ లాంటి పెద్ద పరిశ్రమలో పనిచేయడం తాను గౌరవంగా భావిస్తానని అంటోంది. త్వరలో ఓ భారీ చిత్రంలో నటించబోతున్న ఈ అమ్మడు చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే...
మా అమ్మ మంగళూరు. నాన్న బెంగాలీ. ఆయన ఆర్మీ ఆఫీసర్. పూనెలో పుట్టి పెరిగిన నేను తెలుగులో 3తూనీగ తూనీగ2 సినిమా చేశాక 3మేరీ డాడ్‌కి మారుతి, సోనాలి కేబుల్2 చిత్రాల్లో నటించాను. అలా వరుసగా బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బాంక్ చోర్2లాంటి చిత్రాలకు మంచి పేరు వచ్చింది. ఈ రెండు చిత్రా ల్లో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. 3బాంక్ చోర్2లో జర్నలిస్టుగా చేసిన పాత్ర కామెడీ ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుతం నేను థియేటర్ గ్రూప్‌లో యాక్టింగ్ నేర్చుకుంటున్నా. బెల్లీ డాన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న నేను ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యత ఇస్తా. అనేక పాత్రలు వచ్చినా సరైన గుర్తింపు రాదన్న నెపంతో ఒప్పుకోలేదు. అయితే తెలుగులో మంచి పాత్రల్లో చేయాలనుకుంటున్నా. విద్యాబాలన్, అనుష్క, రానా, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ల నట న ఇష్టపడతా. కథలు రాసే నేను దర్శకత్వం వైపు పోను. తెలుగు లో త్వరలో ఓ మంచి ప్రాజెక్టు చేయబోతున్నాను. యంగ్ హీరో తో నటిస్తుండడం ఆనందాన్నిస్తోంది. త్వరలో మీకు అన్ని డిడెయిల్స్ చెబుతాను. తెలుగు కూడా నేర్చుకుంటున్నానోచ్ అంటూ ముగించింది.