మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా స్థాయిని నలుదిశలా చాటిచెప్పిన బాహుబలి-2 చిత్రం సాధించిన విజయం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంకంటే బాహుబలి-2 ఘనవిజయం సాధించింది. ఇటీవలే 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుని 1700 కోట్ల వరకూ వసూలు చేసి ఎన్నో రికార్డులను సృష్టించింది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రష్యాలో జరిగే మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి-2 చిత్రాన్ని తొలి చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఈ అరుదైన గౌరవంపై దర్శకుడు రాజవౌళి స్పందిస్తూ, మాస్కో ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశారు. రష్యాలో అభిమానుల కోరిక మేరకు ఇండియన్ చిత్రాల ప్రదర్శనను పెంచారట. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రాన్ని చైనాలో 9వేల స్క్రీన్‌లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.