గ్రాఫిక్స్‌తో తొలికిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.డి.రాజు, అభినయ, సాయికిరణ్, భానుచందర్ ముఖ్యపాత్రల్లో.. జె.జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం తొలికిరణం. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 28న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు జె.జాన్‌బాబు మాట్లాడుతూ- ‘ఏసుక్రీస్తు జీవితంపై ఎవరూ తీయని కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఏసు శిలువ వేసిన తరువాత ఆయన 50 రోజులు అక్కడే ఉన్నాడు. ఆ నలభై రోజులు ఏం జరిగిందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అలాగే ఇజ్రాయిల్‌లో కూడా షూటింగ్ చేశాం. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గ్రాఫిక్ విషయంలో అనుకున్నట్టుగా రాకపోవడంతో లండన్ నుండి టెక్నిషియన్‌ను పిలిపించి వర్క్ చేయిస్తున్నాం. ఈ సినిమాలో 60 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఆర్.పి.పట్నాయక్ అందించిన ఆరు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పటికే 70 లక్షల సీడీలు అమ్ముడయ్యాయి. ఆగస్టు 28న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.