సక్సెస్‌కే ఇక్కడ విలువెక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం చూస్తున్న సినిమాల్లో ఎంత పెద్ద విలన్ అయినా, ఎంత హంగామా చేసినా విలన్ల జీవితాలన్నీ అల్యూమినియం ఫ్యాక్టరీలో అంతమవడం నాకిష్టంలేదు. అందుకనే ఈ చిత్రంలో క్లైమాక్స్‌ను భిన్నంగా ట్రై చేశానని అంటున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్, పూజా హెగ్డేలతో తెరకెక్కించిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హరీశ్ శంకర్‌తో ఇంటర్వ్యూ...
* డిజె విషయంలో టెన్షన్‌గా ఉన్నారా?
- ఏ దర్శకుడికైనా సినిమా విడుదల ముందు ఇలాంటి టెన్షన్లు కామనే. సినిమాపై ఎంత నమ్మకమున్నా కూడా మొదటిరోజు మొదటి ఆట పడేవరకూ టెన్షన్ తప్పదు. నాకు ఇది ఆరో సినిమా అయితే, అల్లు అర్జున్‌కు 17వ చిత్రం.
* అల్లు అర్జున్ గురించి?
- ఆర్య సినిమా చూసిన తరువాత అల్లు అర్జున్‌లోని ఎనర్జీకి షాక్ అయ్యాను. ఖచ్చితంగా ఇతనితో ఒక సినిమా చేయాలని అప్పుడే అనుకున్నాను. అప్పటినుంచి చేసిన ప్రయత్నం డిజెతో కుదిరింది. ఈ పాత్ర కోసం తను తీసుకున్న కేర్ మామూలుగా లేదు. ప్రతీ విషయంలో ఎంతో శ్రద్ధతో పనిచేశాడు.
* అల్లు అర్జున్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందా?
- ట్రైలర్‌లో చెప్పినట్లు ఎన్ని షేడ్స్ అనేది విడుదల తరువాత తెలిసిపోతుంది. ఈ పాత్ర కోసం కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజిటేరియన్‌గా ఉన్న పాత్ర ఎందుకలా మారిందనేది సస్పెన్స్. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రత్యేక కేర్ తీసుకున్నాడు. ఈ పాత్రేకాదు తను ఏ సినిమాలో చేసినా ఆ పాత్ర కోసం చాలా కష్టపడతాడు. 365 రోజులూ షూటింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే హీరో బన్నీ.
* ఇంతకీ ఏం చెబుతున్నారు?
- మన చుట్టూ జరుగుతున్న సమస్యలు చూసినపుడు ఆటోమేటిగ్గా మనలో మరో ఫీలింగ్ బయటకు వస్తుంది. ఉదాహరణకు నిర్భయ సంఘటన జరిగినపుడు మనలో చాలామందికి వాళ్ళలోపలనుంచి వెయ్యి గన్నులు పట్టుకున్న వ్యక్తి బయటికి వచ్చి వాళ్ళను అంతమొందించాలన్నంత కసి కల్గుతుంది. ఆ తరువాత కొద్దిసేపటికి అది మాయమైపోతుంది. అలాంటి ఇన్నర్ ఫీలింగ్ బయటికి వచ్చినపుడు ఓ వ్యక్తి ఏం చేశాడనేది ఈ కథ.
* అంటే.. సందేశంలాంటిది ఏమైనా
ఇస్తున్నారా?
- సందేశాలు ఇవ్వడంలేదు. నా దృష్టిలో సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాతో మెసేజ్ ఇస్తే ఎవరూ మారరు. ఒక సినిమాకు సంబంధించిన ఇంపాక్ట్ కొన్ని గంటలు లేదా రోజుల్లో వుంటుంది తప్పా దానివల్ల అందరూ మారతారని అనుకోవడం పొరపాటు. ప్రేక్షకులు కూడా డబ్బులు పెట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌నే కోరుకుంటారు కానీ సందేశాలు కాదు.
* క్లైమాక్స్ ఫన్నీగా మార్చారని తెలిసింది?
- నిజమే. రామాయణం తీసుకున్నా భారతం తీసుకున్నా హీరోనే గెలుస్తాడు. అంతెందుకు వేల కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాల్లో కూడా హీరోనే గెలవడం కామనే. కానీ అంతకుముందు విలన్ ఎంత గంభీరంగా, ఎన్ని బిల్డప్‌లు ఇచ్చినా చివరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో అంతమొందడం నాకు నచ్చలేదు. క్లైమాక్స్ ఫైట్ అనగానే పదిమంది రౌడీలు, మధ్యలో మెయిన్ విలన్, భారీ పోరాటం, చివరగా హీరో గెలవడం. ఇలాంటి రొటీన్‌కు బ్రేక్ వేసి ఇందులో క్లైమాక్స్‌ను ఫన్నీగా మార్చేసా.
* హీరోయిన్‌గా పూజాను
ఎంచుకోవడానికి కారణం?
- కథ ప్రకారం కొత్త అమ్మాయిలా కనిపిస్తే బావుంటుందునిపించింది. దానికితోడు ‘ముకుంద’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో పూజ తెలుగు రాకున్నా కూడా అందులోని ఓ పాటను తెలుగులో నేర్చుకుని మరీ పాడడం బాగా నచ్చింది. ఈ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్ అని ఎంపిక చేశాం. తను ఈ పాత్రలో అద్భుతంగా నటించింది.
* ఓ పాటలోని పదాల విషయంలో
విభేదాలు తలెత్తాయి కదా?
- ఇందులోని పాటలో ‘నమకం చమకం’ అనే పదాల్ని తొలగించి వాటి స్థానంలో వేరే పదాలని చేర్చాం. నిజానికి కావాలని రాసినవి కావు. ముఖ్యంగా ఆ పదాలకు నెగెటివ్ అర్థాలు వస్తాయని కూడా అనుకోలేదు. కానీ కొందరు ఈ విషయంపై అడ్డంకులు తేవడంతో పాటలోని పదాలను మార్చాం. ఏదేమైనా ‘యద్భావం తద్భవతి’ అనే తరహాలో మనం చూసిందే ప్రపంచం అనేలా మారింది. ఇక్కడ ఏ దర్శక నిర్మాత కూడా ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని సినిమా తీయరు.
* మరి పవన్‌తో సినిమా ఎప్పుడు?
- పవన్‌తో ‘గబ్బర్‌సింగ్’ లాంటి విజయాన్ని అందించిన తరువాత చాలామంది మళ్లీ ఆయనతో సినిమా ఎప్పుడని అడుగుతున్నారు. తప్పకుండా చేస్తా. అలాగే చిరంజీవిగారితో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా.

* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లోనే మరో సినిమా చేయబోతున్నా. ఆయన సినిమాల శైలిలోనే ఈ చిత్రం ఉంటుంది. దాంతోపాటు నిర్మాతగా మంచి కథలతో చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచన ఉంది.

-శ్రీ