భాగ్యనగరిలో మహానటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి మేటి నటీమణి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, మరో స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, జెమినీ గణేశన్ పాత్రలో కన్పించనున్నాడు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో షూటింగ్ జరుపుతున్నాం. మొదటి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సావిత్రి అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఉంటుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్, నిర్మాత:స్వప్నాదత్, దర్శకత్వం:నాగ్ అశ్విన్.