గ్లామర్ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి సినిమాతో అచ్చతెలుగు అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకు వరుసగా అలాంటి పాత్రలే రావడంతో బోర్ కొట్టింది.. నేను గ్లామర్ షో చేస్తాను బాబోయ్ అన్నా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో గ్లామర్ పెంచినా కూడా లాభం లేకపోయింది. అన్నీ అలాంటి పాత్రలే! దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో.. బయట ఈవెంట్స్‌కు కూడా గ్లామర్ డ్రెస్‌లో వచ్చి షాక్ ఇస్తోంది. ఇంతకీ అంతలా గ్లామర్ షోకి సిద్ధమైన భామ ఎవరో తెలుసా.. లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమా తరువాత అన్నీ హోలీ పాత్రలే రావడంతో.. క్రేజీ అవకాశాలు తగ్గాయి. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అయితే అవకాశాలు రావడంలేదు. దాంతో ఇలాగైతే లాభం లేదనుకుందో ఏమో.. వెంటనే గ్లామర్ షోకి రెడీ అయింది. కానీ అవకాశాలు మాత్రం రావడంలేదు. దాంతో ఇలా ప్రైవేట్ ఈవెంట్స్‌కు గ్లామర్ డోస్ పెంచి షాక్ ఇచ్చింది. లేటెస్టుగా జరిగిన 64వ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో లావణ్య ఇచ్చిన గ్లామర్ లుక్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి.

చిత్రం..లావణ్య త్రిపాఠి