స్పైడర్‌మాన్ వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైడర్‌మాన్ సినిమా అటు పిల్లలతోపాటు ఇటు పెద్దలకూ ఆసక్తే. చిన్నపిల్లల్లో సూపర్‌హీరోగా మారిన స్పైడర్‌మాన్ సినిమాలు వస్తూనే వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్‌ని ఏర్పర్చుకున్న స్పైడర్‌మాన్ సినిమాకు ఇప్పుడు మరో సిరీస్ రానుంది. స్పైడర్‌మాన్ హోమ్ కమింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచింది. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ విడుదల చేస్తోంది. స్పైడర్‌మాన్ చేసే విన్యాసాలతోపాటు ఐరన్‌మాన్ యాక్షన్ స్టంట్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని, స్పైడర్‌మాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టానే్ల హాలండ్ నటిస్తున్నాడని, ప్రతినాయకుడిగా బర్డ్‌మాన్ ఫేం మిచెల్ కీటన్ నటిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్‌తోపాటు ఇండియన్ భాషల్లో ఈ చిత్రాన్ని జూలై 7న భారీగా విడుదల చేస్తున్నట్లు సోనీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ నటిస్తున్నాడు.