నినే్న కోరుకుంటా ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభకరి క్రియేషన్స్ పతాకంపై సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక, పావని ప్రధాన తారాగణంగా గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ రూపొందించిన చిత్రం ‘నినే్న కోరుకుంటా’. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తూరుపు జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా మంచి విజయం సాధించి దర్శక నిర్మాతలకు పేరు తేవాలని కోరుకున్నారు.
ముగ్గురు యువకులు ఓ యువతికి మధ్య జరిగే రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించామని, కామెడీతోపాటు సందేశం కూడా సినిమాలో వుంటుందని, తప్పక విజయవంతం అవుతుందని కథానాయకుడు విజయభాస్కర్ తెలిపారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటాయని, ముగ్గురి ప్రేమకథ ఒకే తీరంవైపు ఎలా సాగింది అన్నదే ఈ చిత్రంలో ప్రధానంగా వుంటుందని, నేటి యువతీయువకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని దర్శక నిర్మాతలు తెలిపారు. కార్యక్రమంలో దేవిప్రసాద్, మల్కాపురం శివకుమార్, పూజిత, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైజాగ్ ప్రసాద్, రాములు, నాగూ గవర, సంధ్యాజనక్ పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. సరోజ, కొండవలస, ప్రసన్నకుమార్, పూర్ణిమ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:కులశేఖర్, పోతుల రవికిరణ్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: ప్రణవ్, నిర్మాత: మరిపి విద్యాసాగర్ (వినయ్), దర్శకత్వం: గణమురళి శరగడం.