మామ్ నాకో స్పెషల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చాలా రోజుల తరువాత నేను నటించిన ‘మామ్’ సినిమా నాకో స్పెషల్ సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అయితే నటిగా పూర్తి సంతృప్తి పొందాను. ఇదొక సింపుల్ కథ. ఎమోషనల్ ఫ్యామిలీ సెబ్జెక్ట్. తల్లీ కూతుళ్లకు సంబంధించిన కథనం’ అని నటి శ్రీదేవి తెలిపారు. మాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పతాకాలపై శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మామ్’. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి పలు విశేషాలు తెలుపుతూ- అమ్మ ప్రేమకన్నా విలువైనది ఏదీ ఈ ప్రపంచంలో లేదని, అది ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుందని, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఎమోషనల్ కథనంతో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆమె తెలిపారు. భారతదేశంలో ప్రతీ తరానికి తెలిసిన ఒకే ఒక పేరు శ్రీదేవని, బాలనటి నుంచి మామ్ వరకూ ఆమె ప్రయాణం సామాన్యమైనది కాదని, ఆమెతో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుణ్ణి తానేనని దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెలిపారు. శ్రీదేవి సినిమాలో వుందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్లామర్‌గా వుంటుందని వెళ్లిపోతామని, అదేవిధంగా యాక్షన్ కూడా వందశాతం చేసేస్తుందని, ఇంతకాలం తరువాత ఓ మంచి సినిమాతో ముందుకు రావడం ఆనందదాయకమని ఆయన అన్నారు.