ప్రేమికుల పాటల పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకీ, లాస్య జంటగా పి.యు.కె ప్రొడక్షన్స్ పతాకంపై నిర్ణయం దీపికా కృష్ణ రూపొందిస్తున్న చిత్రం 3తొలి పరిచయం2. ఇంద్రగంటి సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. నటుడు మురళీమోహన్ బిగ్ సీడీ, సీడీని విడుదల చేసి సినిమా యూనిట్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ- సినిమాలో పాటలన్నీ మంచి విజయం సాధిస్తాయని, అలాగే సినిమా కూడా హిట్ అవుతుందని తెలిపారు. చక్కటి కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాలో మంచి నటీనటులు ఉన్నారని, పాటలన్నీ సందర్భానుసారం వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఇంద్రగంటి, సహనిర్మాత సురేష్‌కుమార్, సంగీత దర్శకుడు ఇంద్రగంటి, శివాజీరాజా, మల్కాపురం శివకుమార్, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్, వైవా హర్ష, రాగిణి, మధుమణి, ప్రీతినిగం, కళ్లు కృష్ణారావు, సురభి దీప్తి, మాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:చంద్రబోస్, కాసర్ల శ్యామ్, కరుణాకర్, ఎడిటింగ్:కృష్ణపుత్ర, కెమెరా:శ్రావణ్‌కుమార్, దర్శకత్వం:రాధాకృష్ణ.