మైనస్ రేటింగ్ ఇస్తారనుకున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా-ఇండియా యుద్ధ నేపథ్యంతో రూపొందించిన ‘ట్యూబ్‌లైట్’ సినిమాకు విమర్శకులు, సమీక్షకులు ఇచ్చిన రేటింగ్‌పై సల్మాన్ పరోక్ష విమర్శలు చేశారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో నిర్మించిన ట్యూబ్‌లైట్ ఈనెల 23న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రతి రంజాన్ సందర్భంగా సల్మాన్ సినిమా రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. ఈసారి ట్యూబ్‌లైట్‌తో సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఈ సినిమా గొప్పగా లేదని, నటన, కథాంశం, స్క్రీన్‌ప్లే పేలవంగా ఉన్నాయని ప్రఖ్యాత విమర్శకుడు తరణ్ ఆదర్శ్ సహా పలువురు తమ సమీక్షల్లో పేర్కొన్నారు. వీటిపై స్పందించిన సల్మాన్ నిజానికి తన సినిమాకు మైనస్ 3 లేదా మైనస్ 4 రేటింగ్ ఇస్తారని భావించానని, కానీ వారు సహృదయంతో 1, 1.5 రేటింగ్ ఇచ్చారని, ఇది సంతోషం కలిగించిందని అన్నారు. తన సినిమాలను చూసే ప్రేక్షకులు హాలులో చిందులువేసి ఆనందించాలని భావిస్తారని, కానీ ట్యూబ్‌లైట్ అందుకు విరుద్ధమైన ఇతివృత్తంతో నిర్మించిన భావోద్వేగాల చిత్రమని ఆయన అన్నారు. పాషాణ హృదయులను సైతం కరిగించి కన్నీరు తెప్పించే సన్నివేశాల సమాహారం ట్యూబ్‌లైట్ చిత్రమని సల్మాన్ అభిప్రాయపడ్డారు. తన పాత సినిమాల మాదిరిగా స్నేహితులతో ఉల్లాసంగా చూసే చిత్రంలాంటిది ఈ చిత్రం కాదని, కుటుంబం అంతా కలసి చూసి చలించిపోయే కథనంతో కూడుకున్నదని అన్నాడు. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్, పీవిఆర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సల్మాన్ పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యానాలు చేశాడు. సల్మాన్ సోదరుడు సొహైల్‌ఖాన్, చైనాకు చెందిన సినీనటుడు ఝుఝు, స్వర్గీయ ఓంపురి, బాలనటుడు మాటిన్‌రాయ్, ఓ కేమియో పాత్రలో షారుక్‌ఖాన్ ఈ సినిమాలో నటించారు. పివిఆర్ సినిమా థియేటర్లలో ట్యూబ్‌లైట్ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు కొన్న టిక్కెట్లపై రెండు రూపాయల చొప్పున అదనంగా వసూలు చేసి, ఆ మొత్తాన్ని మానవతాసహాయ కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
‘సుల్తాన్’కు బీజింగ్ అవార్డు
గత ఏడాది విడుదలై కాసుల వర్షం కురిపించి బాక్సాఫీసువద్ద సంచలనం సృష్టించిన చిత్రం ‘సుల్తాన్’. భారత మల్లయోధుడి జీవిత చరిత్ర, మరికొంత కల్పనతో కూడిన ఇతివృత్తంతో నిర్మించిన సుల్తాన్ చైనాలోని షాంఘైలో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ యాక్షన్ మూవీ కేటగిరీలో అవార్డు సాధించింది. గత రంజాన్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో ప్రధానపాత్రలో సల్మాన్ నటించగా తొలివారంలో 180 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 584 కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డులు నమోదు చేసింది. కాగా ఈ ఏడాది విడుదలైన దంగల్, బాహుబలి ది కంక్లూజన్ సుల్తాన్ రికార్డులను బద్దలుకొట్టాయి. కాగా అలీ అబ్బాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సుల్తాన్’లో లీడ్‌రోల్‌లో అనుష్కశర్మ నటించగా యశ్‌రాజ్ ఫిల్మ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీనిని నిర్మించారు. కాగా షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సుల్తాన్‌కు అవార్డు దక్కడం ఆనందకరమైన విషయమని నిర్మాత ఆదిత్యచోప్రా పేర్కొన్నారు.