నవ్వుతూ భయపెడుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్మయానంద ఫిలింస్ పతాకంపై శ్రీనాధ్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చరవి, కిరాక్ ఆర్పీ ప్రధాన తారాగణంగా రవివర్మ.వి దర్శకత్వంలో ఎమ్.వి.రమణమూర్తి సమర్పణలో ఎస్.సరిత రూపొందిస్తున్న చిత్రం ‘ఇదేం దెయ్యం’ (ముగ్గురమ్మాయిలతో). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు.
ఈ సందర్భంగా నిర్మాత సరిత చిత్ర విశేషాలను తెలుపుతూ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని ముగ్గురు యువకులకు అనుకోకుండా ఆపద ఎదురైతే వారు తప్పించుకునే ప్రయత్నంలో జరిగే సంఘటనలు ఫన్నీగా వుంటాయని, పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ చిత్రాన్ని కుటుంబమంతా కలిసి చూసేవిధంగా రూపొందించామని, ఐదు పాటలతోపాటుగా రీరికార్డింగ్ హైలెట్‌గా వుంటుందని ఆమె తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసి పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని త్వరలోనే సెన్సార్‌కు పంపనున్నామని ఆమె తెలిపారు. రచనా స్మిత్, రుచి , జీవా, అనంత్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: బాలస్వామి, కెమెరా: కృష్ణప్రసాద్, నిర్మాత: ఎస్.సరిత, దర్శకత్వం: వి.రవివర్మ.