ఖయూం భాయ్ వస్తున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్ట రాంబాబు, తారకరత్న ప్రధాన తారాగణంగా శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో శారదా చౌదరి రూపొందించిన చిత్రం ‘ఖయూం భాయ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పొర్తి చేసి ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. కార్యక్రమంలో దర్శకుడు భరత్ మాట్లాడుతూ అనేక అడ్డంకులు ఎదురైనా మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేశామని, నిర్మాత అడిగినవన్నీ సమకూర్చడంతో మంచి ఔట్‌పుట్ వచ్చిందని తన కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని ఈనెల 30న భారీ ఎత్తున ధియేటర్లకు వస్తున్నామని తెలిపారు. ‘ఖయూం భాయ్’ చిత్రంతో తన కల నెరవేరిందని, సినిమాకు మంచి హైప్ వచ్చిందని, మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని కట్టా రాంబాబు అన్నారు.
రొటీన్ సినిమాను చూసి బోర్ కొట్టినవారికి డిఫరెంట్ సినిమాగా ‘ఖయూంభాయ్’ నచ్చుతాడని కట్టా రాంబాబు ఖయూం భాయ్‌గా బాగా నటించాడని నిర్మాత రామసత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో నిర్మాత శారదా చౌదరి, బిఎన్‌రెడ్డి, బెనర్జీ, వల్లూరిపల్లి రమేశ్, మాస్టర్ కిరణ్, కల్యాణ్, ధనుంజయ్, లక్ష్మణ్, శ్యాం పాల్గొని విశేషాలను తెలిపారు.