వీడని విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ (49) రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. శంషాబాద్‌నుండి హైదరాబాద్‌కు కారులో వస్తున్న ఆయన ఔటర్ రింగ్‌రోడ్‌పై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ మధ్య చాలావరకు ఇలాంటి ఆకస్మిక సంఘటనలతో సినీ ప్రముఖులు నేలరాలుతున్నారు. అజాగ్రత్త, అతి వేగానికి మరికొన్ని కారణాలు తోడవ్వడంతో ప్రాణాలు పోతున్నాయి. గతంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు కోట ప్రసాద్ ఔటర్ రింగ్‌రోడ్‌పైనే యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. కొత్తగా కొనుక్కున్న 1000సిసి స్పోర్ట్స్ బైక్‌పై వెడుతున్న ఆయన యాక్సిడెంట్‌కు గురై మరణించాడు. అప్పుడే నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న కోట ప్రసాద్ జగపతిబాబు హీరోగా నటించిన ‘సాధ్యం’ చిత్రంలో నెగిటివ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. అలాగే మరో నటుడు బాబుమోహన్ తనయుడు కూడా హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో బైక్‌పై వస్తూ డివైడర్‌కు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో హీరోగా పరిచయమైన యశోసాగర్ కూడా కారు ప్రమాదంలో మృతిచెందాడు. ఈమధ్యే నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ కూడా ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్‌గా టాప్‌రేంజ్‌కి ఎదిగిన సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ ప్రమాదలతో తారలుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆకస్మికంగా అంతమైపోవడం బాధ కలిగిస్తోంది.