లక్కీ చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ అనసూయకు అటు టీవీ కార్యక్రమాలతోపాటు ఇటు సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అనసూయ అంటే అందరికీ అదో క్రేజ్. టెలివిజన్ రంగంలో యాంకర్లకు గ్లామర్ సోకులద్దిన అనసూయ గత ఏడాది నటించిన సినిమాలు విజయం సాధించడంతో ఈమెకు అవకాశాలు పెరిగాయి. దాంతోపాటు ‘విన్నర్’లో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. తాజాగా రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో అవకాశం దక్కిందట. పల్లెటూరి నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నటిస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె పాత్ర ఎలా వుంటుంది అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఐటెం సాంగ్స్ చేయమని దర్శక నిర్మాతలు తెగ ఆఫర్లు ఇస్తున్నారట.