ఆకలి పోరాటంలో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ సాగర్ దర్శకత్వంలో గంగాధర్, రేణుక, యశ్వంత్, లిఖిత, చక్రి, హరీశ్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆకలి పోరాటం’. ఈ చిత్రంలోని పాటలు రాజమండ్రిలో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ సాగర్ మాట్లాడుతూ- ఇంజనీరింగ్ చదివిన నలుగురు యువకులు ఉద్యోగానే్వషణలో ఎదుర్కొనే సమస్యలను హాస్యభరితంగా తెరకెక్కించిన చిత్రమిదని, అన్ని రకాల కమర్షియల్ హంగులతో రూపొందించామని, ఇందులో నాలుగు జంటలుంటాయని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- మంచి కథ, కథనంతో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకం ఉంది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈరోజు ఇక్కడ పాటలని విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు. రాజమండ్రి మేయర్ రజనీ శేషసాయి మాట్లాడుతూ ఇక్కడ ఆడియో ఫంక్షన్లు చేయడం ఆనందంగా ఉంది. స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రౌతు సూర్యప్రకాశరావు, ఆదిరెడ్డి అప్పారావు, గట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.