నవ్వించిన రెస్టారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ దీపికా పదుకొనెకు ఇప్పుడు ఎంత క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న ఈమె, బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా తన హవా చాటుకుంటోంది. ఇప్పటికే హాలీవుడ్‌లో సినిమాలు చేసిన దీపికను ఓ రెస్టారెంట్ నవ్వించిందట. రెస్టారెంట్ నవ్వించడమేంటని ఆశ్చర్యపోకండి! ఆ వివరాల్లోకి వెళితే, ఆమధ్య ఆమె ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రాంతానికి వెళ్లిందట. అక్కడ సడెన్‌గా ‘తంగబలి’ పేరుతో ఓ రెస్టారెంట్ ఉండడం చూసి షాకై నవ్వేసిందట. దానికి కారణం దీపిక షారుక్‌తో కలిసి నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో ‘తంగబలి’ పేరుతో ఓ విలన్ వున్న విషయం తెలిసిందే. తంగబలితో దీపికకు పెళ్లిచేయాలని ఆమె తండ్రి ప్రయత్నిస్తుంటాడు. ఈ సంఘటనలు గుర్తుకురావడంతో ఆ బోర్డును చూసి నవ్వు ఆపుకోలేకపోయిందట. త్వరలోనే ఆ రెస్టారెంట్‌కు వెళతానని కూడా చెప్పడం విశేషం.