హైదరాబాద్‌లో రంగస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం రాజమండ్రిలో మరో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇదివరకే మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం అదే ప్రాంతంలో రెండో షెడ్యూల్‌ను నిన్నటితో ముగించేసింది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుపుతారట. ఇప్పటికే 40 శాతంపైగా షూటింగ్ జరిగిందని, షూటింగ్ పట్ల యూనిట్ సభ్యులు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని, ముఖ్యంగా టైటిల్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. రామ్‌చరణ్ కెరీర్‌లో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే శాటిలైట్ హక్కులు భారీ స్థాయికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాంతోపాటు బిజినెస్ కూడా అంతే భారీగా జరుగుతోందట. వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.