అదిరింది విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న 61వ చిత్రం ‘అదిరింది’. అట్లీ దర్శకత్వంలో తెనే్నండాళ్ స్టూడియోస్ పతాకంపై మురళీ రామస్వామి, హేమా రుక్మిణి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మురళీ రామస్వామి మాట్లాడుతూ- నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ శరత్ మరార్‌తో కలిసి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నామని, శరత్‌మరార్ మాతో జాయిన్ అయినందుకు ఆనందంగా ఉందని, తెలుగులో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. శరత్ మరార్ నిర్మించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘కాటమరాయుడు’ లాంటి భారీ చిత్రాలను అందించిన తరహాలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామన్నారు. శరత్ మరార్ మాట్లాడుతూ- విజయ్ 61వ సినిమా ‘అదిరింది’తో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉందని, ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని, విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి రెహమాన్ ఇచ్చిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు. కాజల్, సమంత, నిత్యామీనన్, వడివేలు, సత్యరాజ్, కోవై సరళ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, కెమెరా:జి.కె.విష్ణు, ఎడిటింగ్:రూబన్, కథ:విజయేంద్రప్రసాద్, దర్శకత్వం:అట్లీ.