దువ్వాడ జోరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అల్లు అర్జున్ హీరో హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాథమ్ ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతూ ముఖ్యంగా భారీ వసూళ్లను రాబడుతోంది. మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 64 కోట్ల గ్రాస్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ ఊపు ఇలాగే సాగితే మరో మూడు రోజుల్లో 100 కోట్లను చేరుకునే అవకాశాలు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే 34 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల షేర్‌తో దూసుకుపోతోంది. ‘సరైనోడు’ లాంటి భారీ విజయం తరువాత అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో బన్నీ కొత్త పాత్ర అందరినీ ఆకట్టుకుంది.