స్క్రిప్ట్ సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రం ముగింపు దశలో ఉంది. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ‘్భరత్ అను నేను’ చిత్రీకరణ ఇదివరకే మొదలైంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ పాల్గొననున్నాడు. ‘శ్రీమంతుడు’ తరువాత కొరటాల శివతో తెరకెక్కే ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తికావచ్చిందట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన కథను విన్న మహేష్ ఆసక్తిగా ఉన్నాడని, త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెడతామని చెప్పినట్లు దర్శకుడు తెలిపాడు. ఆయన అలా చెప్పడంతో దర్శకుడిగా తనకు కొత్త ఉత్సాహం కలిగిందని అంటున్నాడు వంశి పైడిపల్లి. త్వరలోనే సెట్స్‌పైకి రానున్న ఈ సినిమాను మహేష్‌ను ఎలా చూపించనున్నాడు అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.