సూర్యతో జోడీగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మలయాళ భామ అను ఇమాన్యుయెల్ నటిస్తోందట. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ ఫైనల్‌గా ఆమెను ఎంపిక చేసారు. నాని నటించిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అను ఇమాన్యుయెల్ మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ సినిమా తరువాత వరస అవకాశాలతో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం పవన్-త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న అను ఈ సినిమాల తర్వాత టాప్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.