ఐటమ్‌పై ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ విజయంతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేవసేనగా ఆమె రెండు షేడ్స్‌లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఉన్న అనుష్క ప్రస్తుతం ‘్భగమతి’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. తాజాగా ప్రభాస్ ‘సాహో’లో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమె ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు రంగం సిద్ధమైంది. మహేశ్‌బాబు హీరోగా నటించే ‘్భరత్ అను నేను’ చిత్రంలో అనుష్కతో ప్రత్యేక పాటను చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపామని, పాటకు ప్రాముఖ్యత ఉండడంతో ఈ సాంగ్ చేయడానికి అనుష్క ఆసక్తిగానే ఉందట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుష్క ఈ సినిమాలో ప్రత్యేక పాట చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.