అన్ని పాత్రలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరీష్, అవంతిక జంటగా లేడీ డైరక్టర్ జయ.బి దర్శకత్వంలో ఆర్‌జె సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న విడదలవుతున్న సందర్భంగా హీరోయిన్ అవంతికతో ఇంటర్వ్యూ.
* మీ గురించి?
- మాది ఢిల్లీ. నాన్న ఎయిర్‌ఫోర్స్ అధికారి. ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగాను. అమ్మ గృహిణి.
* సినీ రంగ ప్రవేశం?
- చిన్నప్పటినుంచి పైలట్ లేదా స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకున్నా. నేను స్టేట్ లెవల్ బాడ్మింటన్ కూడా ఆడాను. కానీ సినిమాలంటే ఆసక్తి వుండడంతో ఇక్కడికి వచ్చా. నా తొలి చిత్రం ‘మాయ’.
* ‘వైశాఖం’లో మీ పాత్ర?
- దర్శక నిర్మాతలు నా ఫోటోలు చూసి పిలిచారు. కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో మోడరన్ అమ్మాయిగా కనిపిస్తాను, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి. అలాగే ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. నా పాత్ర పేరు భానుమతి.
* హీరో హరీష్ గురించి?
- హరీష్ చాలా మంచి వ్యక్తి. ఎనర్జిటిక్‌గా ఉంటాడు. తనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది.
* దర్శకురాలు జయతో పని చేయడం ఎలా ఉంది?
- జయగారు మహిళా దర్శకురాలైనా కూడా చాలా కష్టపడతారు. ముఖ్యంగా కథపై ఆమెకున్న నమ్మకం చాలా ఎక్కువ. ప్రతి షాట్ చక్కగ రావాలని కష్టపడతారు. ఆవిడ వర్కింగ్ స్టయిల్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.
* డాన్స్‌లు నేర్చుకున్నారా?
- కథక్ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో డాన్స్ చేయడం అనేది కొత్త అనుభూతి. ప్రతి జోనర్‌లో ఒక్కో పాట ఉండడంతో కాస్త కష్టపడాల్సి వచ్చింది. కజకిస్తాన్‌లో మైనస్ 5 డిగ్రీల చలిలో కూడా సాంగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి.
* ఈ బానర్‌లో పని చేయడం ఎలా ఉంది?
- నిర్మాత రాజు ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆయన తీసారు. ఇలాంటి బానర్‌లో చేస్తే నాకు కూడా చాలా బెటర్.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో అశోక్‌సెల్వన్‌తో ‘నెంజమెల్ల కాదల్’ చిత్రం చేస్తున్నాను.
* తెలుగులో మీ అభిమాన హీరో?
- అందరూ ఇష్టమే. ముఖ్యంగా బాహుబలి-2, డిజె సినిమాలు బాగా నచ్చాయి. ప్రభాస్, బన్నీల సరసన నటించాలని ఉంది.

-శ్రీ