రజనీకాంత్ అభిమానుల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కబాలి సెల్వ దర్శకత్వంలో కబాలి సెల్వ, తంబిరామయ్య, షఫీ ముఖ్య పాత్రల్లో ఎం.కోటేశ్వరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘12-12-1950’ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డేట్‌ను సినిమా టైటిల్‌గా పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కబాలి సెల్వ వివరాలు తెలియజేస్తూ ‘నేను రజనీకాంత్ వీరాభిమానిని, ఆయన పుట్టినరోజంటే నాకు పండగే, ఈ చిత్రం గురించి చెప్పాలంటే రజనీకాంత్ వీరాభిమానులైన నలుగురి కథే ఇది, రజనీకాంత్ సినిమా విడుదల కోసం ఎదురు చూసే ఈ నలుగురు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమాను చూసారు, ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే కథతో తెరకెక్కిస్తున్నాం, ఇప్పటికే షూటింగ్ పూర్తయి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పన్స్ వచ్చింది, త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం, పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది’ అని అన్నారు.