ప్రేక్షకులు మెచ్చే దర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ క్రియేటివ్ రైటింగ్స్ పతాకంపై అశోక్, ఈశ జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్శకుడు’. విజయకుమార్, థామస్‌రెడ్డి ఆదూరి రవిచంద్ర, సత్తిలు నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. హీరో రామ్ చరణ్ సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, పి.వి.పి, సతీష్ వేగేశ్న, దశరథ్, సురేందర్ రెడ్డి, సుకుమార్ పాల్గొన్నారు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది, నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో దశరథ్ పేరు బాగా వినిపించేది, తనను కలిసాను, ఆయన ఫ్యాషన్ నాకర్ధమైంది, అలాగే ఇక్కడకు వచ్చిన దర్శకులందరితో నాకు మంచి అనుబంధం ఉంది, అడగ్గానే ఈ వేడుకకు వచ్చిన రామ్‌చరణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, ఇక రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘రంగస్థలం’ చిత్రం చేయాలని ఆలోచించాను. తను చిరంజీవి అబ్బాయిగా పుట్టి వుండొచ్చు కానీ తను మట్టిమనిషి, కాఫీలో బెల్లం కలుపుకుని తాగే బాపతు, హీరోలందరిలో చాలా నాచురల్, డౌన్ టు ఎర్త్ పర్సన్, దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు, అందులో సందేహం లేదు కానీ ఈ సినిమాకు సాయికార్తీక్‌ను పెట్టుకున్నాం, తను వందరెట్లు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘మంచి వ్యక్తుల గురించి మనం రోజూ మాట్లాడుకోం. సుకుమార్ నా అభిమాన దర్శకుడు, తక్కువ రోజుల్లోనే బాగా దగ్గరైన వ్యక్తి, ఆయన ఓ బానర్‌ను మొదలుపెట్టి కొత్త దర్శకులకు అవకాశాలివ్వడం గొప్ప విషయం, అందుకు ఆయనను అభినందిస్తున్నాను.