కొత్త దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది-2’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత నాగార్జున కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మంచి అభిరుచి గల చిత్రాన్ని అందిస్తున్న నాగార్జున ప్రస్తుతం అఖిల్, విక్రమ్ కుమార్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఆయన నటించే తదుపరి చిత్రానికి సంబంధించి ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో దాన్ని డెవలప్ చేసుకురమ్మని చెప్పాడట. ప్రస్తుతం ఆ దర్శకుడు స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడని, అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రం ఆగస్టులో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణతో ‘బంగార్రాజు’ చిత్రం చేయాలి కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు వాయిదా పడడంతో ఇప్పుడు కొత్త దర్శకుడు లిస్టులోకి వచ్చాడు.