గాయపడిన కంగన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ స్టార్ కంగనా రౌనత్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మణికర్ణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో జరుగుతోంది. షూటింగ్ సమయంలో పోరాట సన్నివేశాలని చిత్రీకరిస్తుంటే ప్రమాదవశాత్తు వేరొకరి కత్తి కంగన ముఖానికి తగలడంతో గాయపడిందట. రెండు కనుబొమల మధ్యలో కత్తివేటు తగలడంతో తీవ్రంగా రక్తస్రావం అయిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా కుట్లు వేసి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై నిర్మాత కమల్ జైన్ మాట్లాడుతూ- ఎలాంటి డూప్ లేకుండా యుద్ధ సన్నివేశాలు చేసే సమయంలో పొరపాటున ఈ ప్రమాదం జరిగిందని, కంగన కూడా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొన్నదని తెలిపారు. ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.