రామ్‌చరణ్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం 1985 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ చిత్రం తరువాత కొరటాల శివతో మరో సినిమా చేయడానికి రామ్‌చరణ్ సిద్ధమయ్యాడు. నానితో ‘నేను లోకల్’ అంటూ కమర్షియల్ హిట్‌ను అందించిన త్రినాథరావు నక్కినతో మరో సినిమాలో నటించనున్నాడట. ఇప్పటికే దర్శకుడు త్రినాథ్ కథను కూడా వినిపించాడని, కథ నచ్చడంతో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథను డెవలప్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. నిర్మాతగా దిల్‌రాజు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.