అజిత్ వివేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై అజిత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందించిన ‘వివేగం’ చిత్రాన్ని తెలుగులో వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని ‘వివేకం’ పేరుతో అందిస్తున్నారు. తెలుగు సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలైంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా యూత్, మాస్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో జేమ్స్‌బాండ్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ ఓ కీలకపాత్రలో నటించడం విశేషం. బ్లాక్‌బస్టర్ హిట్ అజిత్ ఖాతాలో ఖాయమని టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాననంతర కార్యక్రమాలను జరుపుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.