యువర్స్ లవింగ్లీ పోస్టర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృథ్వీ పొట్లూరి, సౌమ్యా శెట్టి జంటగా జో దర్శకత్వంలో పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృధ్వీ పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘యువర్స్ లవింగ్లీ’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ఈ సినిమా పేరులోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని, అందరూ కొత్తవాళ్ళతో రూపొందించిన ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందన్నారు. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న పృధ్వీ పొట్లూరికి మంచి భవిష్యత్తు వుంటుందని, సినిమా విడుదలయ్యాక చిత్రం గురించే అందరూ మాట్లాడుకుంటారని దర్శకుడు జో అన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ఈ సినిమా చూడవచ్చని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేస్తామని ఆయన అన్నారు. హీరో పృధ్వీ మాట్లాడుతూ- ‘వినోదాత్మక అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కొంత సందేశాన్ని కూడా అందిస్తున్నాం. జో అనే నూతన దర్శకుణ్ణి పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నా. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేటి తరం ప్రేమకథతో తెరకెక్కుతోంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు.