సంఘమిత్ర దుమారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ భామ శ్రుతి హాసన్‌పై కోలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం సంఘమిత్ర సినిమా నుండి ఆమె తప్పుకోవడమే. సుందర్.సి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సంఘమిత్ర సినిమా కోసం ముందు శ్రుతి హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా కోసం కత్తియుద్ధాలు, గుర్రపుస్వారి వంటివి నేర్చుకుని పది రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్న శృతి, ఈ సినిమా చేయలేనని తప్పుకుంది. దాంతో సంఘమిత్ర టీమ్ ఆమెపై ఫోకస్‌పెట్టి ఈ తరహా ప్రచారం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా సీనియర్ నటి కుష్బూ కూడా పరోక్షంగా శ్రుతిపై విమర్శలు గుప్పించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదని, సరైన ప్లానింగ్ లేకుండా సినిమా మొదలుపెట్టారని అనడం కరెక్టు కాదని, రెండేళ్లకుపైగానే ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, మీ లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయద్దని, పారంపర్య సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వృత్తిలో పరిణితి ఎదురుచూస్తారని, మీ లోపాలు సరిదిద్దుకున్నప్పుడే సుధీర్ఘ ప్రయాణం చేయగలరంటూ ట్విట్టర్‌లో ఘాటుగా కామెంట్ చేసింది. దాంతో కుష్బూ శ్రుతితిహాసన్‌ను టార్గెట్ చేసిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై శృతి ఎలా స్పందిస్తుందో చూడాలి!

చిత్రం.. శ్రుతి హాసన్