28న గౌతమ్‌నంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, హన్సిక, క్యాథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం గౌతమ్‌నంద. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాల్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- ‘గోపీచంద్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేశాక యు/ఎ సర్ట్ఫికెట్ ఇచ్చారు. మరోవైపు బిజినెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ స్టైలిష్ నటన చూస్తారు. సంపత్‌నంది అత్యద్భుతంగా తెరకెక్కించాడు. హన్సిక, క్యాథరిన్‌ల నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, కెమెరా:ఎస్.సౌందర్‌రాజన్, నిర్మాతలు:జె.్భగవాన్, జె.పుల్లారావు, దర్శకత్వం:సంపత్‌నంది.