గుంటూరు టాకీస్‌లో వినోదాల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్, మంచు లక్ష్మి, మహేష్‌మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 3న ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ నిర్మాత రాజీపడకుండా రూపొందించిన ఈ చిత్రంలో సామాజిక స్పృహతోపాటు ఔట్ అండ్ ఔట్ కామెడీతో ప్రతి పాత్ర నవ్విస్తుందని, బాలకృష్ణ ఈనెల 3న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారని తెలిపారు. తొలి సన్నివేశంనుండి చివరి సన్నివేశం వరకూ పూర్తి హాస్యభరితంగా సాగే ఈ చిత్రంలో రేష్మీగౌతమ్ కథానాయికగా నటిస్తోందని, 90 శాతం సినిమాను హిందూపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని నిర్మాత రాజ్‌కుమార్ ఎం. తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తామని ఆయన అన్నారు.