అది వారి ఇష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేము సినిమా నటులం అయినంత మాత్రాన మా పిల్లలు కూడా అదేవిధంగా నటించాలని ఎప్పటికీ అనుకోం. వారు పెద్దయ్యాక వారి అభిరుచిని బట్టి ఎలా బతకాలనుకుంటే అలా బతుకుతారు. ఈ విషయంలో తాము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయము2అని నిన్నటి తరం నటి మధుబాల చెబుతోంది. రోజా చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలతోపాటుగా హిందీ భాషలో కూడా పలు చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్న మధుబాల, తన కూతురుని కూడా హీరోయిన్‌గా చేయాలని అనుకుంటోందట.
మిగిలిన వాళ్లతో పోలిస్తే నటీనటుల పిల్లలు నటులు అవ్వడానికి కొన్ని సదుపాయాలు వుంటాయని అంటోంది. నేను నటిని కనుక నాపిల్లలు కూడా నటులవ్వాలంటే వారికి సహాయం ఎలాంటిదైనా చేస్తాను. సినీ నేపథ్యం లేనివాళ్లకు ఇలాంటి అవకాశాలు ఉండవు. నా పిల్లలకు మాత్రమే అవకాశాలు నేను ఇప్పించగలను కానీ, నటులుగా తీర్చిదిద్దలేను. అది వారి ప్రతిభ, సామర్ధ్యం, అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది అంటూ చెబుతోంది మధుబాల. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు అమేయ హీరోయిన్‌గా నటించాలని ఉవ్విళ్లూరుతోందట. ఏదైనా సరే చదువుపూర్తయిన తర్వాతే నటించే ప్రయత్నం చేయమని సలహా ఇస్తోంది మధుబాల.

చిత్రం..మధుబాల