నిజమైన ఓటర్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు, సురభి జంటగా రామా రీల్స్ పతాకంపై జిఎస్ కార్తీక్ దర్శకత్వంలో జాన్ రూపొందిస్తున్న చిత్రం ఓటర్ (హీరో ఆఫ్ ది నేషన్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ఐర్లాండ్‌లో పూర్తి చేసారు. మరో పాటను ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావస్తోందని టాకీపార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలిపారు. విష్ణు కెరీర్‌లో వైవిధ్యంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఆడియో విడుదల కూడా జరపనున్నామని, ఓ వైవిధ్యమైన కథా కథనంతో రూపొందుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. సంపత్‌రాజ్,పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, ఎల్‌బి శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, సంగీతం: ఎస్‌ఎస్ తమన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జిఎస్ కార్తీక్.