దెయ్యంగా భయపెడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్నా ఇప్పటివరకు లేడీ ఒరియంటెడ్ లాంటి ప్రయోగం చేయలేదు. నటించగల సత్తా వున్న ఈ అందాల భామకు మంచి గుర్తింపు లభించినా గ్లామర్ హీరోయిన్ ఇమేజ్‌నే కాపాడుకుంటూ వస్తోంది. తాజాగా కాజల్‌కు కూడ ఉమన్ సెంట్రిక్ చిత్రంలో అవకాశం వచ్చిందట. అది కూడా హారర్ చిత్రంతో భయపెట్టడానికి సిద్ధమవుతోందట. ఇంతగా ఆమెను మెప్పించేలా ఓ కథను కాజల్ దగ్గరకు తీసుకువెళ్లడంతో, దయ్యం పాత్ర అయినా నటించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. హారర్ చిత్రాలు తీయడంలో అందె వేసిన ఓ సౌత్ ఫిలిం మేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇది కూడా కాజల్ నటించడానికి మరో కారణంగా భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన రానుండడంతో కాజల్‌ను దెయ్యం పాత్రలో చూడక తప్పదన్నమాట. ప్రస్తుతం రానా నటిస్తున్న నేనేరాజు నేనేమంత్రి చిత్రం విడుదల కోసం కాజల్ ఎదురు చూస్తోంది. కల్యాణ్‌రామ్‌తో కలిసి చాలాకాలం తర్వాత ఎమ్మెల్యే చిత్రంలో కూడా నటిస్తోంది. కాజల్ తెలుగులో నటించిన తొలి చిత్రం లక్ష్మీకల్యాణంలో కల్యాణ్‌రామ్‌తో నటించింది. ఆ తర్వాత ఆ కాంబినేషన్ ఇన్నాళ్లకు కుదిరింది.